News

ప్రజా బ్యాలెట్‌ నిర్వహిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి


సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ కేసీఆర్‌ జేబు సంస్థ అని టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలపై ప్రజా బ్యాలెట్‌ నిర్వహిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. జీహెచ్‌ఎంసీలో వంద కోట్ల స్కాం, హైదరాబాద్‌లో రోడ్డ దుస్థితిపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ భవన్‌, క్యాంపు ఆఫీస్‌ ఎక్కడైనా ప్రజా బ్యాలెట్‌కు సిద్ధమా? అని సవాల్ విసిరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. చిల్లర సర్వేలతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం మానుకోవాలని రేవంత్ అన్నారు.